శభాష్‌ పోలీసన్నా! మెచ్చుకున్న కేంద్రమంత్రి

తాజా వార్తలు

Published : 04/05/2020 23:53 IST

శభాష్‌ పోలీసన్నా! మెచ్చుకున్న కేంద్రమంత్రి

దిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగించారు. మార్చి 22న జనతా కర్ఫ్యూతో మొదలైన లాక్‌డౌన్‌, మే 17 వరకు కొనసాగనుంది. ఈ పరిస్థితుల్లో  విద్యార్ధులు అతి విలువైన విద్యా సంవత్సరాన్ని నష్టపోతున్నారు. ఇక ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన చిన్నారుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఈ నేపథ్యంలో రోజుకు 12 గంటల పాటు విధులను నిర్వహించటమే కాకుండా చదువుకోవాలనే ఆసక్తి ఉన్న చిన్నారులకు విద్య నేర్పుతున్న ఓ కానిస్టేబుల్ ఔధార్యం.. కేంద్ర మానవవనరుల మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌ ప్రశంసలను అందుకుంది. 

‘‘కరోనావైరస్‌ మహమ్మారి వ్యాప్తిస్తున్న ఈ సమయంలో పోలీసు సిబ్బంది అతికీలక విధులను నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా చదువుకోవాలనే తపన ఉన్న ఇద్దరు చిన్నారులకు ఉత్తరాఖండ్, రుద్రపూర్‌లోని కొవిడ్‌-19 క్వారంటైన్‌ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఈ కానిస్టేబుల్‌ చదువు చెబుతున్నారు. ఆయన అంకిత భావానికి, దయాగుణానికి సెల్యూట్‌ చేస్తున్నాను.’’ అని రమేష్‌ పోఖ్రియాల్‌ ప్రశంసించారు. అంతేకాకుండా ఓ అక్క, తమ్ముడికి చదువు చెబుతున్న ఆ కానిస్టేబుల్‌కు చెందిన చిత్రాలను కూడా మంత్రి షేర్‌ చేశారు. కాగా, ఆదర్శవంతమైన ఆ కానిస్టేబుల్‌తో పాటు చిన్నారులు కూడా మాస్కులను ధరించటం గమనార్హం! 

 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని