‘పోలీస్‌ రాజ్యంగా పశ్చిమ బెంగాల్‌’

తాజా వార్తలు

Published : 04/05/2020 22:58 IST

‘పోలీస్‌ రాజ్యంగా పశ్చిమ బెంగాల్‌’

గవర్నర్‌ జగదీప్‌ ధన్‌ఖడ్

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గవర్నర్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బెంగాల్‌లో మమతా ‘పోలీస్‌ రాజ్యం’ నడిపిస్తున్నారని గవర్నర్‌ సోమవారం ఆరోపించారు. రాజ్యాంగ నిబంధనలపై ఆమె తప్పుడు దృక్పథం.. నిరంకుశత్వాన్ని ప్రతిబింబిస్తోందన్నారు. దీనికి ప్రజాస్వామ్యంలో చోటులేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ‘దురదృష్టవశాత్తూ బెంగాల్‌.. పోలీసు రాజ్యంగా మారుతోంది. ఎవరైనా ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తే పోలీసులు వచ్చి ఇంటి తలుపు తడతారు. చేదు నిజం ఏంటంటే.. రాష్ట్రంలో అన్యాయంగా అధికారాన్ని ఎవరు స్వాధీనం చేసుకుంటున్నారో.. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారో.. సిండికేట్లతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారో రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఇదంతా బహిరంగ రహస్యమే! కచ్చితంగా నేను మాత్రం కాదు. రాష్ట్ర వ్యవహారాలపై నేను సరైన సమాచారమే అందించానని చెప్పగల’ను అని అందులో రాసుకొచ్చారు. దీదీ ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని.. కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు ఆదుకునేందుకు ముందుకు రావాలన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని