రోడ్డెక్కిన 1200 మంది వలస కార్మికులు

తాజా వార్తలు

Updated : 04/05/2020 22:49 IST

రోడ్డెక్కిన 1200 మంది వలస కార్మికులు

శంషాబాద్‌: నగరంలో వలస కార్మికులు ఒక్కసారిగా రోడ్డెక్కారు. ఎల్ అండ్‌ టీ సంస్థలో పనిచేస్తున్న దాదాపు 1200 మంది వలస కార్మికులు శంషాబాద్‌ నుంచి కాచిగూడకు బయలుదేరారు. రాజేంద్రనగర్‌ పరిధిలోని అరాంఘర్‌ వద్దకు రాగానే పోలీసులు వారిని అడ్డగించారు. వెనక్కి వెళ్లేది లేదని పోలీసులతో వాగ్వాదానికి దిగిన కార్మికులు కాసేపు అక్కడే ఆందోళనకు దిగారు. అనంతరం అక్కడినుంచి కాచిగూడ వైపు బయలుదేరారు. పాతబస్తీ, బహరదూర్‌పురాలో వారిని మరోసారి పోలీసులు అడ్డుకున్నారు. కార్మికులంతా యూపీ, బిహార్‌, ఝర్ఖండ్‌ రాష్ట్రాలకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. కార్మికులకు నచ్చజెప్పిన పోలీసులు వారిని తిరిగి శంషాబాద్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని