ఆరు వేళ్లకు ఆ జన్యువే కారణం

తాజా వార్తలు

Updated : 05/05/2020 08:47 IST

ఆరు వేళ్లకు ఆ జన్యువే కారణం

సీడీఎఫ్‌డీ శాస్త్రవేత్త అశ్విన్‌దలాల్‌
  పరిశోధన పత్రంలో వెల్లడి

హైదరాబాద్‌: కొంతమంది చేతులు, కాళ్లకు ఆరు వేళ్లు ఉండటం గమనించే ఉంటాం. ఇలా ఎందుకు జరుగుతుందనే దానిపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. తాజాగా సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ అండ్‌ డయాగ్నసిస్‌(సీడీఎఫ్‌డీ) శాస్త్రవేత్త అశ్విన్‌ దలాల్‌ దీనికి కారణం కనుగొన్నారు. దీనికి సంబంధించి ఆయన రాసిన పరిశోధన వ్యాసం అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడికల్‌ జెనిటిక్స్‌లో ప్రచురితమైంది. తన బృందంతో కలిసి అశ్విన్‌ దలాల్‌ కొంతకాలంగా దీనిపై పరిశోధన చేస్తున్నారు. బీహెచ్‌ఎల్‌హెచ్‌ఎ9 అనే జన్యువు పరివర్తన చెందడమే ఆరు వేళ్లు ఏర్పడడానికి కారణమని, సమీప బంధువులను వివాహాలు చేసుకుంటే దీనికి అవకాశం ఉంటుందని ఆయన పరిశోధనలో వెల్లడైంది. ఈ ఆవిష్కరణ ద్వారా భవిష్యత్తులో ముందుగానే జన్యు పరీక్షలు నిర్వహించి పుట్టే పిల్లల్లో ఈ లోపం సరిదిద్దడానికి అవకాశం ఉంటుంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని