భారతీయ ఫొటో జర్నలిస్టులకు పులిట్జర్‌

తాజా వార్తలు

Updated : 05/05/2020 11:46 IST

భారతీయ ఫొటో జర్నలిస్టులకు పులిట్జర్‌

దిల్లీ: జమ్మూ్-కశ్మీర్‌కు చెందిన ముగ్గురు ఫొటోజర్నలిస్టులను జర్నలిజంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే పులిట్జర్‌ పురస్కారం వరించింది. ఫీచర్‌ ఫోటోల విభాగంలో దార్‌ యాసిన్‌, ముఖ్తార్‌ ఖాన్‌, చన్నీ ఆనంద్‌ ఈ అవార్డుకు ఎంపికయ్యారు. అధికరణ 370 రద్దు తర్వాత ప్రభుత్వం విధించిన నిషేధాజ్ఞల సమయంలో అక్కడి ప్రజల జీవన స్థితిగతుల్ని తమ చిత్రాల ద్వారా ప్రపంచానికి తెలియజేసినందుకుగానూ వారికి ఈ పురస్కారం లభించింది. ఆ సమయంలో ఇంటర్నెట్‌పై రాష్ట్రంలో ఆంక్షలు విధించడంతో వార్తలను అందించడంలో పాత్రికేయులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాటన్నింటినీ అధిగమించి వీరు అక్కడి పరిస్థితుల్ని కళ్లకు కట్టేటట్లు తీసిన చిత్రాలు ఎంతో ఆదరణ పొందాయి. వీరు ప్రస్తుతం అంతర్జాతీయ వార్తా సంస్థ ‘అసోసియేటెడ్‌ ప్రెస్‌’కు పనిచేస్తున్నారు. పరిశోధనాత్మక కథనాలు, అంతర్జాతీయ వార్తల విభాగంలో అమెరికాకు చెందిన ది న్యూయార్క్‌ టైమ్స్‌ పాత్రికేయులకు పురస్కారం వరించగా.. ఎడిటోరియల్‌ రైటింగ్‌లో హెరాల్డ్‌ ప్రెస్‌కు అవార్డు లభించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని