నిత్యావసర సరకులకు వెళ్తున్నారా.. జాగ్రత్తలివే?

తాజా వార్తలు

Published : 05/05/2020 16:16 IST

నిత్యావసర సరకులకు వెళ్తున్నారా.. జాగ్రత్తలివే?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ ప్రజలు బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఈ ప్రాణాంతక మహమ్మారి ఏ వైపు నుంచి ఏ రూపంలో కమ్ముకొస్తుందోనని జనం ఆందోళన చెందుతున్నారు. కరోనా కట్టడే ధ్యేయంగా భారత్‌లో కొనసాగుతున్న లాక్‌డౌన్‌-3 నేపథ్యంలో ప్రభుత్వాల విజ్ఞప్తుల మేరకు ప్రజలు ఇళ్లకే పరిమితమైపోయారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని ప్రభుత్వం పదేపదే చెబుతున్న నేపథ్యంలో నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు మాత్రం దుకాణాలు/ రైతు బజార్లు/ సూపర్‌ మార్కెట్లు/ మందుల దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా బారినపడకుండా ఉండేందుకు కేంద్రం సూచిస్తున్న జాగ్రత్తలేంటో చూద్దామా..!

> సొంత బ్యాగ్‌ను తీసుకెళ్లండి.
> గుడ్డ సంచులనే వాడండి. ప్లాస్టిక్‌/ పేపర్‌ బ్యాగుల వాడకానికి దూరంగా ఉండండి. 
>  షాపింగ్‌ పూర్తయిన తర్వాత సంచిని సబ్బుతో శుభ్రం చేసుకోవాలి.
> సరకులను కొనుగోలు చేస్తున్న సమయంలో  మాస్క్‌ ధరించాలి.
> వీలైనంత వరకు డిజిటల్‌ చెల్లింపులకే ప్రాధాన్యమివ్వండి. నగదు చెల్లింపులను తగ్గించండి
> షాపింగ్‌ సమయంలో మీ ముఖాన్ని చేతులతో తాకొద్దు.
> తరచుగా బయటకి రావొద్దు.
> ఇతరులకు కనీసం 1 మీటర్‌ దూరం పాటించాలి.
> షాపింగ్‌ సమయంలో వాడే బాస్కెట్‌/ ట్రాలీలను పట్టుకొనే భాగాన్ని శానిటైజ్‌ చేసుకోండి
> షాపింగ్‌కు వెళ్లే ముందు సరకులు కొని ఇంటికి వచ్చిన చేతులను శుభ్రం చేసుకోండి.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని