పరిశ్రమ యాజమాన్యంపై కేసు నమోదు‌: గౌతమ్‌ రెడ్డి

తాజా వార్తలు

Updated : 07/05/2020 15:50 IST

పరిశ్రమ యాజమాన్యంపై కేసు నమోదు‌: గౌతమ్‌ రెడ్డి

అమరావతి: గ్యాస్‌ లీకేజీ ఘటనకు కారణమైన పరిశ్రమ యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం ఎల్‌జీ పాలీమర్స్‌ పరిశ్రమ నుంచి గ్యాస్‌ లీకేజీ నిలిపివేసినట్లు ఆయన తెలిపారు. ఘటన జరిగిన వెంటనే పరిశ్రమల శాఖ అధికారులతో మంత్రి సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఎన్‌డీఆర్‌ఎఫ్‌, నౌకాదళ సిబ్బంది సాయంతో లీకేజీని నియంత్రించినట్లు చెప్పారు. గ్యాస్‌ లీకేజీ కారణంగా పరిశ్రమ నుంచి 1.5 కిలోమీటర్ల పరిధిలో ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు మంత్రి తెలిపారు. పరిసర ప్రాంతాల్లో నీటి పిచికారీ ద్వారా గాల్లో గ్యాస్‌ ప్రభావాన్ని నియంత్రించినట్లు వివరించారు. అస్వస్థతకు గురైన వారిని కాపాడేందుకే మొదటి  ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని