ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీపై కేసులు నమోదు

తాజా వార్తలు

Published : 07/05/2020 18:06 IST

ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీపై కేసులు నమోదు

విశాఖ: విశాఖలో గ్యాస్‌ లీకేజీ దుర్ఘటన నేపథ్యంలో ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీపై కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు గోపాలపట్నం పోలీసులు పలు సెక్షన్ల కింద ఆ సంస్థపై కేసులు నమోదు చేశారు. సెక్షన్‌ 337, 338, 304 కింద కేసులు నమోదు చేసినట్లు గోపాలపట్నం పోలీసులు తెలిపారు.

విశాఖలో ఎల్జీ పాలీమర్స్‌ నుంచి స్టైరీన్‌ విష వాయువు లీకైన దుర్ఘటనలో 11 మంది మృతిచెందిన విషయ తెలిసిందే. ఈ గ్యాస్‌ ప్రభావానికి గురైన 200 మందికి పైగా వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. వీరిలో 25 నుంచి 30 మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో పాటు మరో 80మందికి పైగా వెంటిలేటర్లపై ఉన్నారు. ఘటనా స్థలం నుంచి దాదాపు 500 మందికి పైగా ప్రజలను అక్కడ నుంచి సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు.

ఇవీ చదవండి..

విషవాయువులు సృష్టించిన విధ్వంసాలు..!

స్టైరీన్‌ లీకేజీ.. విశాఖలో మహా విషాదం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని