గ్యాస్‌ లీక్‌ తీవ్రత తగ్గించేందుకు చర్యలు

తాజా వార్తలు

Published : 07/05/2020 18:58 IST

గ్యాస్‌ లీక్‌ తీవ్రత తగ్గించేందుకు చర్యలు

విశాఖ: విశాఖ జిల్లాలోని ఆర్‌.ఆర్‌ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీ నుంచి గ్యాస్‌ లీకైన ప్రాంతంలో తీవ్రత తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. లీకైన గ్యాస్‌ తీవ్రతను తగ్గించేందుకు ఉపయోగపడే పీటీబీసీ రసాయనాన్ని తీసుకొచ్చేందుకు ఏపీ సర్కార్‌ ప్రయత్నిస్తోంది. 500 కిలోల పీటీబీసీ రసాయనాన్ని గుజరాత్‌ నుంచి తెప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు రసాయనం పంపాలని గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీకి ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. లీకైన విష వాయువును పీటీబీసీ రసాయనం న్యూట్రల్‌ చేస్తుందని అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి..

ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీపై కేసులు నమోదు

మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం

విషవాయువులు సృష్టించిన విధ్వంసాలు..!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని