వారు త్వరగా కోలుకోవాలి: విజయశాంతి

తాజా వార్తలు

Published : 07/05/2020 19:42 IST

వారు త్వరగా కోలుకోవాలి: విజయశాంతి

హైదరాబాద్‌: విశాఖ గ్యాస్‌లీక్‌ దుర్ఘటనపై కాంగ్రెస్ నేత, సినీనటి విజయశాంతి స్పందించారు. గ్యాస్‌లీక్‌ బాధితులు త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు. ఈ మేరకు విజయశాంతి ట్వీట్‌ చేశారు. ‘‘కరోనా వైరస్ ఒకవైపు యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న సమయంలో విశాఖపట్నం, పరిసర గ్రామాల ప్రజలు విషవాయువు బారిన పడటం ఎంతో బాధ కలిగిస్తోంది. వృద్ధులు, మహిళలు, బాలలు, మూగజీవాలు ఈ విషవాయువు ప్రభావానికి లోనై తీవ్ర అనారోగ్యం పాలవడం, మరణాలు సంభవించడం వంటి పరిణామాలు తీరని వేదనను మిగిల్చాయి. బాధిత కుటుంబాలవారికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గుండె ధైర్యంతో కరోనాపై పోరాడుతున్న విశాఖ పౌరులు, పరిసర గ్రామాలవారు ఈ విషవాయువు ప్రభావం నుంచి త్వరగా బయటపడాలని కోరుకుంటున్నాను’’ అని విజయశాంతి ట్వీట్‌ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని