బాధితులకు అండగా ఉంటాం: ఆళ్ల నాని

తాజా వార్తలు

Published : 07/05/2020 21:54 IST

బాధితులకు అండగా ఉంటాం: ఆళ్ల నాని

విశాఖ: గ్యాస్‌ లీకేజీ ఘటనపై విశాఖ కలెక్టరేట్‌లో రాష్ట్ర మంత్రులు ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. సమీక్షలో మంత్రి ఆళ్లనాని, బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్‌, సీఎస్‌ నీలం సాహ్ని పాల్గొన్నారు. గ్యాస్‌ లీకేజీ ఘటన బాధితులకు అండగా ఉంటామని వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని తెలిపారు. క్షతగాత్రులకు పూర్తి స్థాయిలో వైద్య సదుపాయాలు కల్పిస్తామన్నారు. బాధితులకు మంచి ఆహారం అందించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ప్రత్యేక వైద్య బృందాలతో చుట్టుపక్కల గ్రామాల్లో శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆళ్ల నాని వివరించారు. 
గ్యాస్ లీకేజీ ఘటనపై అధ్యయన కమిటీ పూర్తి స్థాయిలో విచారణ చేస్తుందన్నారు. 
ఆరోగ్య శ్రీ ద్వారా పూర్తి స్థాయిలో వైద్య సదుపాయం కల్పించాలని ముఖ్యమంత్రి వైస్ జగన్‌ మోహన్‌ రెడ్డి అదేశించారని చెప్పారు. బాధితులు పూర్తిగా కోలుకునే వరకు ఉచితంగా వైద్య సేవలు అందించాలని సీఎం జగన్‌ ఆదేశించినట్లు ఆళ్ల నాని వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని