గ్యాస్‌లీక్‌ బాధితులకు రెండు రోజుల్లో పరిహారం

తాజా వార్తలు

Published : 09/05/2020 21:42 IST

గ్యాస్‌లీక్‌ బాధితులకు రెండు రోజుల్లో పరిహారం

వెల్లడించిన మంత్రి కన్నబాబు

విశాఖ: విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనపై ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక వచ్చేవరకు ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీ పూర్తిగా మూసివేసే ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింట్ శాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. గ్యాస్‌ లీకేజీ ప్రభావం కారణంగా పరిశ్రమ పరిసర ప్రాంతాల ప్రజలు బియ్యం, ఇంట్లో ఉన్న నిత్యావసరాలు ఏవీ వాడకూడదని చెప్పారు. పరిశ్రమ చుట్టుపక్కల బోరుబావులను తనిఖీ చేస్తున్నామన్నారు. ప్రమాద ఘటన పరిసరాల్లో విషవాయువు ప్రభావం వేగంగా తగ్గతోందని.. దీన్ని మరింత తగ్గించే చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. విషవాయువు ప్రభావం ఉన్న ఐదు గ్రామాల ప్రజలను రేపు సాయంత్రం వరకు వెంకటాపురం వెళ్లకూడదని కన్నబాబు సూచించారు.

ప్రమాద ఘటనపై అంతర్గత కమిటీ వేశామని.. పరిసరాల్లో విషవాయువు ప్రభావం ఎలా ఉండనుందో ఈ కమిటీ పరిశీలించి నివేదిక ఇస్తుందని కన్నబాబు తెలిపారు. గ్యాస్‌ లీకేజీ ఘటన తర్వాత 585 మంది ఆస్పత్రిలో చేరగా.. ప్రస్తుతం 485 మంది చికిత్స పొందుతున్నారని మంత్రి వివరించారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా బాధితులకు అందించాల్సిన పరిహారాన్ని రెండు రోజుల్లో అందిస్తామన్నారు. చనిపోయిన పశువులకు సైతం రెండు రోజుల్లో పరిహారం అందిస్తామని కన్నబాబు పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని