మాజీ మంత్రి రత్నాకర్‌రావు కన్నుమూత

తాజా వార్తలు

Updated : 10/05/2020 12:07 IST

మాజీ మంత్రి రత్నాకర్‌రావు కన్నుమూత

జగిత్యాల: కాంగ్రెస్‌ నేత మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌రావు మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కరీంనగర్‌ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. జగిత్యాల జిల్లా తిమ్మాపూర్‌లో జువ్వాడి రత్నాకర్‌రావు అంత్యక్రియలు నిర్వహించనున్నటులు కుటుంబ సభ్యులు తెలిపారు.

తిమ్మాపూర్‌ సర్పంచిగా  రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన త్నాకర్‌రావు జగిత్యాల సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. 1989లో తొలిసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మూడు పర్యాయాలు బుగ్గారం ఎమ్మెల్యేగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దేవాదాయశాఖ మంత్రిగా పనిచేశారు. రత్నాకర్‌రావు మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు ఈటల రాజేందర్‌, కొప్పుల ఈశ్వర్‌, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, జీవన్‌రెడ్డి, కేవీపీ రామచంద్రరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ తదితరులు సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని