కేజీహెచ్‌ వద్ద గ్యాస్‌లీక్‌ బాధితుల ఆందోళన

తాజా వార్తలు

Updated : 12/05/2020 15:57 IST

కేజీహెచ్‌ వద్ద గ్యాస్‌లీక్‌ బాధితుల ఆందోళన

విశాఖ: విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న గ్యాస్‌ లీకేజీ బాధితులు ఆందోళనకు దిగారు. ఆరోగ్యం మెరుగుపడకుండానే డిశ్చార్జ్‌ చేస్తున్నారంటూ బాధితులు నిరసన చేపట్టారు. తమ ఆరోగ్యం ఇంకా సాధారణ స్థితికి రాలేదని.. అనారోగ్యంతో ఉన్న తమను ఎలా డిశ్చార్జ్‌ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. విషవాయువు ప్రభావంతో తమలో ఎలాంటి సమస్యలున్నాయనే విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదని.. ఇలాంటి సమయంలో తిరిగి గ్రామాలకు ఎలా వెళ్లాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మరికొంత మందిని డిశ్చార్జ్‌ చేసేందుకు వైద్యులు ఏర్పాట్లు చేస్తున్నారని బాధితులు వాపోయారు. ప్రభుత్వం అందించే ఎలాంటి డబ్బు తమకొద్దని.. సంపూర్ణ ఆరోగ్యంగా తమను ఇళ్లకు పంపించగలిగితే చాలని మరికొందరు బాధితులు కోరుతున్నారు.


 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని