ఒక్కడు.. 25 మందిని కాపాడి..

తాజా వార్తలు

Updated : 13/05/2020 07:54 IST

ఒక్కడు.. 25 మందిని కాపాడి..

అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న అశ్వినికుమార్‌

విశాఖపట్నం(వన్‌టౌన్‌), న్యూస్‌టుడే: వెంకటాపురం గ్రామానికి చెందిన యువకుడు యల్లపు అశ్వినికుమార్‌(26) గ్యాస్‌ లీకేజీ ఘటన జరిగినప్పుడు సమయస్ఫూర్తి ప్రదర్శించారు. ఈ నెల 7న (గురువారం) తెల్లవారు జామున 25 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆ సమయంలో విషవాయువును పీల్చి తీవ్ర అస్వస్థతకు గురై ప్రస్తుతం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. మంగళవారం అశ్వినికుమార్‌ తన అనుభవాలను ‘న్యూస్‌టుడే’తో పంచుకున్నారు. ‘నాన్న అప్పలనాయుడు ఎల్‌జీ పాలిమర్స్‌ సంస్థలో భద్రతా ఉద్యోగి. గురువారం తెల్లవారుజామున 3.30గంటలకు స్టైరీన్‌ గ్యాస్‌ లీకైనట్లు గుర్తించి ఎల్‌జీ పాలిమర్స్‌ భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేసేందుకు ఫోన్‌ చేశా. ఫోన్‌ ఎత్తిన భద్రతాధికారి ఏమీ మాట్లాడకుండా పెట్టేశారు. గ్యాస్‌ తీవ్రత పెరగడంతో మా కుటుంబంలోని నలుగురిని నిద్రలేపి మరో చోటుకు వెళ్లాలని చెప్పా. మా ఇంటిని ఆనుకొని ఉన్న ఏడు ఇళ్లలో ఉన్న సుమారు 25 మందిని అప్రమత్తం చేసి బయటకు పంపా. కొంత మందిని వెంకటాపురం రైల్వేట్రాక్‌ దాటించా. ఆ సమయంలో అస్వస్థతకు గురయ్యా. ప్రాణాలు పోయాయనుకున్నా. నాతోపాటు మా కుటుంబ సభ్యులు అస్వస్థతకు గురయ్యారు. అయిదు రోజులవుతున్నా ఇంత వరకు ఆరోగ్యం కుదుట పడలేదు. ఇంకా వికారంగా ఉంది. ఏమి తిన్నా వాంతి వచ్చేలా ఉంది. ఇంకా కొన్ని రోజుల పాటు కేజీహెచ్‌లో ఉంచి చికిత్స అందించాల’ని అశ్వినికుమార్‌ కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని