విశాఖ గ్యాస్‌లీక్‌.. తగ్గని స్టైరీన్‌ ప్రభావం

తాజా వార్తలు

Updated : 13/05/2020 20:25 IST

విశాఖ గ్యాస్‌లీక్‌.. తగ్గని స్టైరీన్‌ ప్రభావం

విశాఖ: విశాఖలోని ఆర్.ఆర్‌.వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్‌ పరిసర ప్రాంతాల్లో స్టైరీన్‌ విషవాయువు ప్రభావం స్థానికులపై ఇంకా చూపిస్తోంది. ఉన్నతాధికారుల భరోసాతో ఇప్పుడిప్పుడే ఇళ్లకు చేరుకుంటున్న వారు ఇళ్లను శుభ్రం చేస్తుకుంటున్న క్రమంలో పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కంపెనీ పరిసర గ్రామంలో ఇప్పటికీ పలువురు గ్రామస్థులు స్ఫృహ తప్పి పడిపోతున్నారు. వెంకటాపురంలోని కరణం జ్యోతి అనే మహిళ తన ఇల్లు తుడుస్తూ కుప్పకూలిపోవడంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. మహిళ పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం గోపాలపట్నంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇంటింటి సర్వే చేసే ఆశా కార్యకర్త సైతం విషవాయువు ప్రభావంతో సొమ్మసిల్లి పడిపోయింది.

ఎల్‌జీ పాలిమర్స్‌ పరిసర ప్రాంతాల్లో విషవాయువు ప్రభావం తగ్గుముఖం పడుతోందని.. రెండు లేదు మూడు రోజుల్లో ప్రజలు వారి గ్రామాలకు వెళ్లవచ్చని ఓవైపు మంత్రులు, ఉన్నతాధికారులు చెబుతున్నారు. మరోవైపు విషవాయువు గ్రామస్థులపై తీవ్ర ప్రభావం చూపిస్తూనే ఉంది. రెండు రోజుల క్రితం పలువురు రాష్ట్ర మంత్రులు సైతం గ్యాస్‌లీకేజీ ప్రభావిత ప్రాంతాల్లో నిద్రించి పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పిన విషయం తెలిసిందే. ఇంతలోనే ఆయా గ్రామాల్లోని ప్రజలు తాజాగా మరోసారి స్ఫృహతప్పి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని