న్యాయవాదులకు నూతన డ్రెస్‌కోడ్‌

తాజా వార్తలు

Published : 13/05/2020 23:21 IST

న్యాయవాదులకు నూతన డ్రెస్‌కోడ్‌

సిబ్బందిని కోరిన ప్రధాన న్యాయమూర్తి బాబ్డే

దిల్లీ: న్యాయమూర్తులు, న్యాయవాదులను చూడగానే నలుపు రంగు కోట్లు గుర్తుకు వస్తాయి. అయితే వారు ఇప్పుడు వాటికి గుడ్‌బై చెప్పనున్నారు. దానికి కూడా కరోనా మహమ్మారే కారణం. ఈ నేపథ్యంలో కొత్త డ్రెస్‌ కోడ్‌ను త్వరలో వెల్లడిస్తామని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే బుధవారం ప్రకటించారు. అప్పటి వరకు నల్లని దుస్తులు ధరించవద్దని న్యాయ సిబ్బందికి సూచించారు. ‘ప్రస్తుతానికి నల్ల కోట్లు, గౌన్లు ధరించడం మానుకోండి. వాటికి కరోనా వైరస్ సులభంగా అంటుకుంటుంది’ అని ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా బాబ్డే వ్యాఖ్యానించారు.

వైరస్‌ వ్యాప్తి కారణంగా చాలా రోజులుగా న్యాయమూర్తులు ఇంట్లోనే ఉండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసులు విచారిస్తున్నారు. అయితే నిన్నటి నుంచే కోర్టు గదుల్లో కేసుల విచారణ ప్రారంభమైంది. కానీ ప్రతివాదులు ఇప్పటికీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే విచారణలో పాల్గొంటున్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని