నల్లకోటు కొన్నాళ్లిక ఉండదు

తాజా వార్తలు

Updated : 14/05/2020 08:53 IST

నల్లకోటు కొన్నాళ్లిక ఉండదు

 కరోనా నేపథ్యంలో న్యాయవాదులకు కొత్త డ్రెస్‌ కోడ్‌

ఈనాడు, దిల్లీ: వీడియో కాన్ఫరెన్సుల ద్వారా పాల్గొనే విచారణల్లో న్యాయవాదులు సంప్రదాయ నలుపు రంగు కోట్లు, గౌన్లను ధరించనవసరంలేదని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఓ ప్రకటన జారీచేసింది. కరోనా విపత్తు సమసిపోయే వరకూ లేదా తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకూ దీన్ని అనుసరించాలని సూచించింది. ‘‘వైద్య నిపుణుల సూచనల మేరకు... కొవిడ్‌-19 వ్యాప్తిని నిలువరించేందుకు సంప్రదాయ కోట్లు, గౌన్లను ధరించవద్దు. విచారణ సమయంలో న్యాయవాదులు ఎలాంటి డిజైన్లు లేని తెలుపు చొక్కా/సల్వార్‌-కమీజ్‌/తెల్ల చీర, తెలుపు రంగు నెక్‌ బ్యాండ్‌ను ధరించాలి’’ అని అందులో పేర్కొంది. అంతకుముందు ఉదయం ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డే వీడియో ద్వారా విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా సహచర న్యాయమూర్తులు, న్యాయవాదులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ-‘‘నలుపు రంగు కోట్లు, గౌన్లను కొంతకాలం ధరించడం మానుకుందాం. వాటి ద్వారా వైరస్‌ సులభంగా వ్యాపించే ముప్పుంది’’ అని వ్యాఖ్యానించారు. జస్టిస్‌ బోబ్డ్డే, ఇతర న్యాయమూర్తులు తెెల్ల చొక్కాలపై నెక్‌ బ్యాండ్లను ధరించి విచారణ చేపట్టారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని