ఏపీ, తెలంగాణ సరిహద్దులో నిలిచిన వాహనాలు

తాజా వార్తలు

Updated : 15/05/2020 10:55 IST

ఏపీ, తెలంగాణ సరిహద్దులో నిలిచిన వాహనాలు

అశ్వారావుపేట: వలస కూలీలకు సరిహద్దు కష్టాలు తప్పడం లేదు. ఒక రాష్ట్రంలో అధికారులు అనుమతిచ్చినా మార్గ మధ్యంలో మరో రాష్ట్రం అధికారులు అడ్డుకోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట సమీపంలోని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సరిహద్దు చెక్‌పోస్టు వద్ద శుక్రవారం ఉదయం వాహనాలు భారీగా నిలిచిపోయాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో హైదరాబాద్‌ నుంచి అధికారుల అనుమతితో 2వేల మంది వలస కూలీలు దాదాపు 60 వాహనాల్లో పశ్చిమబెంగాల్‌కు బయలు దేరారు.

వారందరినీ అశ్వారావుపేట సరిహద్దు చెక్కపోస్టు వద్ద ఏపీ సరిహద్దు భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి వచ్చిన వాహనాలన్నీ సరిహద్దుల్లోనే ఆగిపోయాయి. దీంతో సుమారు 2వేల మంది వలస కూలీలు సరిహద్దుల్లో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం 9గంటల తర్వాత ఏపీ అధికారులతో చర్చల అనంతరం వలస కూలీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కేవలం ఏపీ రాష్ట్రం దాటే వాహనాలను మాత్రమే అనుమతించారు. ఇతర వాహనాలను సరిహద్దు వద్దే ఆపేశారు. దీంతో ఆ ప్రాంతమంతా వలస కూలీలలతో జనసంద్రంగా మారింది.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని