రోడ్డుపై పరుగులు తీయించిన పెద్దపులి!

తాజా వార్తలు

Published : 16/05/2020 01:55 IST

రోడ్డుపై పరుగులు తీయించిన పెద్దపులి!

సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్‌..

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎవరికైనా పెద్దపులిని చూస్తేనే గుండె హడలెత్తిపోతుంది. ఒక్కసారి అది గాండ్రిస్తే చాలు, ఆ చుట్టుపక్కల ఉండకుండా పారిపోతాం. అలాంటిది ఓ పెద్దపులి రోడ్డు పక్కన పరుగెడుతుంటే ఎలా ఉంటుంది. ఊహించుకోవడానికే భయమేస్తుంది కదా!! కానీ, అలా రోడ్డు పక్కనే ఓ పెద్దపులి పరిగెత్తడం, దాన్ని పట్టుకోడానికి ముగ్గురు వ్యక్తులు ప్రయత్నించడం నిజంగా జరిగింది. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో నెటిజెన్లు తెగ లైకులు, షేర్లు, కామెంట్లు చేస్తున్నారు. 

ఓ వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. మెక్సికోలోని జలిస్కోలో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియని ఓ పెద్దపులి రోడ్డు పక్కనే పరుగెడుతూ కనిపించింది. దాన్ని బంధించి, పట్టుకోడానికి ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తుల్ని ఆ పులి పరుగులు తీయించింది. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి దీన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. 20 సెకన్ల వీడియోలో ఒక వ్యక్తి తాడుతో దాన్ని పట్టుకోడానికి ప్రయత్నించగా, మరో వ్యక్తి ఆ పులి ముందుకు పరుగెత్తి, పారిపోకుండా కుర్చీతో అడ్డుకున్నాడు. చివరికి అది వెనక్కి మళ్లడంతో తాడు విసిరి పట్టుకున్నట్టు కనిపించింది. అక్కడితో వీడియో పూర్తైంది. అయితే, ఆ పులి ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై కచ్చితమైన సమాచారం లేదు. ఏదైనా ప్రైవేట్‌ జూ నుంచి తప్పించుకొని ఉండొచ్చని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కాగా, హైదరాబాద్‌ శివారు రాజేంద్రనగర్‌లోనూ గురువారం ఉదయం నడిరోడ్డుపై ఓ చిరుత పులి కనిపించి ప్రజలని భయభ్రాంతులకు గురిచేసింది. అది సమీపంలోని ఓ ఫామ్‌హౌజ్‌లోకి వెళ్లగా అప్పటి నుంచి దాని జాడ కనబడటం లేదు. 

 

 

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని