రాష్ట్రపతి భవన్‌ పోలీస్ అధికారికి కరోనా 

తాజా వార్తలు

Published : 18/05/2020 00:53 IST

రాష్ట్రపతి భవన్‌ పోలీస్ అధికారికి కరోనా 

దిల్లీ: రాష్ట్రపతి భవన్‌లో విధులు నిర్వహిస్తున్న పోలీసు ఉన్నతాధికారికి కరోనా సోకినట్లు అక్కడి అధికార వర్గాలు తెలిపాయి. దీంతో రాష్ట్రపతి భవన్‌లోని పలువురు భద్రతా సిబ్బందిని కార్వంటైన్‌లో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రపతి గృహ సముదాయానికి సమీప ప్రాంతంలోనే సదరు అధికారి కార్యాలయం ఉండటంతో ఆ ప్రాంతం మొత్తం శానిటైజేషన్ చేసినట్లు తెలిపారు. దిల్లీ పోలీస్‌ విభాగంలో అసిస్టెంట్ కమిషనర్‌ హోదాలో పనిచేస్తున్న ఐపీఎస్‌ అధికారికి రాష్ట్రపతి భవన్‌లో భద్రతా చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈనెల 13న ఆయనకు పరీక్షలు నిర్వహించారు. ఆయనలో కరోనా లక్షణాలు లేనప్పటికీ ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆయన్ను ఐసోలేషన్‌కు తరలించారు. ఆదివారం పరీక్షల ఫలితాల్లో పాజిటివ్‌ అని నిర్థారణ కావడంతో ఆయనతో కలిసి పనిచేసిన భద్రతా సిబ్బంది మొత్తాన్ని క్వారంటైన్‌కి తరలించినట్లు  రాష్ట్రపతి భవన్‌ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గత నెలలో కూడా రాష్ట్రపతి సెక్రటేరియట్‌లో భవనంలో పనిచేసే ఓ ఉద్యోగి బంధువు కరోనా రోగితో సన్నిహితంగా మెలగడంతో అక్కడ పనిచేసే  115 కుంటుంబాల వారిని క్వారంటైన్‌కు తరలించిన విషయం తెలిసిందే. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని