అయినా.. ముంబయికే వెళ్తాం!
close

తాజా వార్తలు

Published : 19/05/2020 05:15 IST

అయినా.. ముంబయికే వెళ్తాం!

ముంబయి: లాక్‌డౌన్‌ వల్ల పర్యాటక, ఆతిథ్య రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కరోనా వైరస్‌ ముప్పుతో ఇప్పుడప్పుడే పర్యాటక రంగానికి ఊపు వచ్చేలా కనిపించడం లేదు. అన్ని దేశాలు, నగరాలు వైరస్‌ ముప్పుతో తల్లడిల్లుతున్నాయి. అయినప్పటికీ సంక్షోభం తర్వాత దుబాయ్‌, ముంబయి నగరాలను సందర్శించడమే తమ తొలి ప్రాధాన్యమని పర్యాటకులు చెబుతున్నారు.

డిజిటల్‌ ట్రావెల్‌ కంపెనీ బుకింగ్‌.కామ్‌ 2020, మార్చి-ఏప్రిల్‌ మధ్య ఈ సర్వే చేసింది. ముంబయి నగరమే తమ పర్యాటక గమ్యస్థానమని ఎక్కువమంది భారతీయులు ఓటు వేశారు. ఆ తర్వాతి స్థానాల్లో గోవా, దిల్లీ, లోనావాలా, బెంగళూరు నిలిచాయి. ఇక అంతర్జాతీయంగా దుబాయ్‌కు తొలి ప్రాధాన్యం ఇచ్చారు. ఆ తర్వాత ఉబుద్‌ (బాలి), బ్యాంకాక్‌ (థాయ్‌ల్యాండ్‌), ఇస్తాంబుల్‌ (టర్కీ), లండన్‌ (బ్రిటన్‌) ఉన్నాయి.

‘ప్రస్తుత పరిస్థితులను గతంలో ఎన్నడూ చూడలేదు. ఇలాంటి విపత్కర పరిస్థతుల్లో భద్రతే అన్నిటికన్నా ముఖ్యం. సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా పర్యటించాలని కలగనడం మనల్ని ఆత్మవిశ్వాసంతో ఉంచుతుంది. మరోసారి అవకాశం వస్తే విభిన్న ప్రాంతాలను మా వినియోగదారులు సందర్శించాలనుకోవడం అద్భుతం’ అని బుకింగ్‌.కామ్‌ కంట్రీ మేనేజర్‌ రితు మెహురోత్ర అన్నారు.

తమ ఇంటి నుంచి బయటకు వస్తే ఎక్కువ మంది భారతీయ పర్యాటకులు హోటళ్లలో ఉండేందుకే ఇష్టపడుతున్నారు. ఆ తర్వాత రిసార్టులు, అతిథి గృహాలు, అపార్టుమెంటులు, విల్లాల్లో ఉండాలని కోరుకుంటున్నారు. దాదాపు 42% మంది హోటళ్లు, 18% మంది రిసార్టులకు ఓటువేశారు.

చివరగా అంతర్జాతీయ పర్యాటకుల విషయానికి వస్తే భారత్‌లో దిల్లీ, ముంబయి, గోవా, జైపుర్‌, బెంగళూరును ఎక్కువగా సందర్శించాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం ముంబయి, దుబాయ్‌ల్లో కరోనా వైరస్‌ వ్యాప్తి విపరీతంగా ఉన్న సంగతి తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని