బాంద్రాలో మరోసారి ఉద్రిక్తత... 

తాజా వార్తలు

Published : 19/05/2020 18:13 IST

బాంద్రాలో మరోసారి ఉద్రిక్తత... 

పెద్ద సంఖ్యలో రైల్వేస్టేషన్‌కు చేరుకన్న వలస కార్మికులు 

ముంబయి: వలస కార్మికులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రామిక్‌ రైళ్లను నడుపుతున్న విషయం తెలిసిందే. తాజాగా ముంబయిలోని బాంద్రా రైల్వేస్టేషన్ నుంచి బీహార్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నారనే వార్తలు రావడంతో వేలాది మంది వలస కార్మికులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అయితే పోలీసులు మాత్రం శ్రామిక్‌ ప్రత్యేక రైల్లో ప్రయాణించేందుకు ముందస్తుగా తమ వివరాలను నమోదు చేసుకున్న వెయ్యి మంది కార్మికులను  మాత్రమే అనుమతించారు. మిగిలిన వారిని అక్కడి నుంచి వెనక్కి పంపేసినట్లు బాంద్రా రైల్వే స్టేషన్ వర్గాలు తెలిపాయి. 

మంగళవారం ఉదయం 9 గంటల నుంచి తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు వేలాది మంది వలస కార్మికులు బాంద్రా రైల్వేస్టేషన్‌కు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ముంబయి నుంచి బీహార్‌, ఉత్తరప్రదేశ్‌లకు ప్రత్యేక శ్రామిక్‌ రైళ్లు నడపుతున్నారని కొందరు కార్మికులకు ఫోన్లు రావడంతో పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అయితే అవన్నీ తప్పుడు వార్తలని, కేవలం ముందుస్తుగా నమోదు చేసుకున్న వారిని మాత్రమే ప్రయాణించేందుకు అనుమతిస్తున్నారిని తెలుసుకుని నిరాశచెందారు. ఒక్క సారిగా అంత మంది కూలీలు ఎలా రోడ్లపైకి వచ్చారనే దానిపై విచారణ జరిపిన పోలీసులు ఈ ఘటన సంబంధం ఉన్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. 

గత నెలలో కూడా వలస కూలీలను తరలించేందుకు బాంద్రా రైల్వేస్టేషన్ నుంచి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారనే తప్పుడు వార్తలు రావడంతో పెద్ద ఎత్తున వలస కార్మికులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. తమను స్వస్థలాలకు పంపాలని ఆందోళన చేపట్టారు. దీంతో వారిని అక్కడి నుంచి పంపేందుకు పోలీసులు లాఠీఛార్జీ జరిపిన విషయం తెలిసిందే.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని