ఎల్‌జీ పాలిమర్స్‌ వద్ద గ్రామస్థుల ఆందోళన

తాజా వార్తలు

Updated : 09/07/2021 15:32 IST

ఎల్‌జీ పాలిమర్స్‌ వద్ద గ్రామస్థుల ఆందోళన

విశాఖ: విశాఖ జిల్లా ఆర్.ఆర్‌.వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పరిశ్రమ వద్దకు పెద్దఎత్తున చేరుకున్న వెంకటాపురం వాసులు ఆందోళనకు దిగారు. తమ గ్రామానికి ఎలాంటి వసతులు అందించడం లేదంటూ ఆందోళన చేపట్టారు. తమ గ్రామాన్ని వదిలిపెట్టి మిగతా గ్రామాలకు వసతులు కల్పిస్తున్నారంటూ గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. పరిశ్రమ వద్ద ఆందోళన చేస్తున్న వెంకటాపురం గ్రామవాసులకు పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. స్టైరీన్‌ విషవాయువు ప్రభావిత గ్రామాల్లో ఆర్.ఆర్‌.వెంకటాపురం కూడా ఉందని.. ఎలాంటి పుకార్లు నమ్మకూడదంటూ పోలీసులు గ్రామస్థులకు నచ్చజెప్పడంతో వారు వెనుదిరిగారు. తమ ఆరోగ్యాలపై స్టైరీన్‌ విషవాయువు ప్రభావం ఏవిధంగా ఉండనుందో తెలియదని.. అధికారులు, వైద్యులు సైతం ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదని పలువురు గ్రామస్థులు వాపోయారు. తమకు పరిహారం ముఖ్యం కాదని.. భవిష్యత్‌లో ఆరోగ్య సమస్యలు తలెత్తితే ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని రకాలుగా ఉపయోగపడేలా న్యాయం చేయాలని వెంకటాపురం వాసులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఇవీ చదవండి..

ఎన్జీటీకి విచారణాధికారం లేదు: ఎల్జీ పాలిమర్స్‌

స్టైరీన్‌ లీకేజీ.. విశాఖలో మహా విషాదం

 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని