కరోనా నుంచి కోలుకుంటున్న ఎస్‌ఆర్‌పీఎఫ్‌ జవాన్లు

తాజా వార్తలు

Published : 19/05/2020 21:55 IST

కరోనా నుంచి కోలుకుంటున్న ఎస్‌ఆర్‌పీఎఫ్‌ జవాన్లు

ఔరంగబాద్‌: మహరాష్ట్రలో కొన్నిరోజుల క్రితం కరోనాపాజిటివ్‌గా తేలిన సుమారు 67 మంది రాష్ట్ర రిజర్వుపోలీసుదళానికి చెందిన జవాన్లు చెందిన జవాన్లు క్రమక్రమంగా కోలుకుంటున్నట్టు అధికారులు మంగళవారం తెలిపారు. మహరాష్ట్రలోని ఔరంగబాద్‌ జిల్లాలో ఉన్న దళంలోని జవాన్లు మే 7వ తేదిన తమకు డ్యూటీ కేటాయించబడ్డ మాలేగావ్‌ నగరం నుంచి  తిరిగివచ్చారు. ఆ క్రమంలో వారికి పరీక్షలు చేయగా కరోనాపాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో మొత్తం 67 జవాన్లులో 64 మందిని ప్రత్యేకంగా సతరా ప్రాంతంలో ఏర్పాటుచేసిన తాత్కాలిక చికిత్సాకేంద్రానికి తరలించి చికిత్స చేస్తున్నారు. మిగతా ముగ్గురు ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం వీరందరి ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందని, త్వరలోనే అందరిని డిశ్చార్జ్‌ చేయనున్నట్టు సంబంధిత అధికారి వెల్లడించారు. మహరాష్ట్రలో రోజురోజుకు కరోనావైరస్‌ విజృంభిస్తుండగా ఔరంగబాద్‌ జిల్లాలోనే మంగళవారం 53 కొత్త కొవిడ్‌-19 కేసులు బయటపడ్డాయి. ఈ ఒక్క జిల్లాలోనే ఇప్పటివరకు 1,075 కేసులు నమోదైనట్టు జిల్లా అధికారులు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని