అర్ధరాత్రి నుంచి ఓఆర్ఆర్‌పై రయ్‌రయ్‌

తాజా వార్తలు

Updated : 20/05/2020 17:24 IST

అర్ధరాత్రి నుంచి ఓఆర్ఆర్‌పై రయ్‌రయ్‌

హైదరాబాద్: లాక్‌డౌన్‌ కారణంగా దాదాపు రెండు నెలలుగా మూతపడ్డ ఔటర్‌ రింగ్‌ రోడ్డు తెరుచుకోనుంది. ఇవాళ అర్ధరాత్రి నుంచి ఓఆర్‌ఆర్‌పై అన్ని వాహనాలను అనుమతించనున్నట్లు హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ అర్ధరాత్రి నుంచి వాహనాల రాకపోకలను పునరుద్ధరించాలని హెచ్‌ఎండీఏ, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్‌ (హెచ్‌జీసీఎల్‌) నిర్ణయం తీసుకున్నాయన్నారు.

వాహనాలను అనుమతిస్తున్నందున ప్రజారోగ్య రక్షణ చర్యల్లో భాగంగా ఓఆర్‌ఆర్‌పై టోల్‌గేట్ నిర్వహణ సిబ్బంది భద్రతా చర్యలు పాటించాలని హెచ్‌ఎండీఏ, హెచ్‌జీసీఎల్ నిర్దేశించాయి. డిజిటల్ పేమెంట్ పద్ధతిలో ఫాస్టాగ్‌ చెల్లింపులకు అవకాశం ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించాయి. వాహనదారులు వీలైనంత మేరకు నగదు రహిత లావాదేవీలకు ముందుకు రావాలని హెచ్‌ఎండీఏ సూచించింది. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటున్న నేపథ్యంలో ఆ సమయంలో ఓఆర్‌ఆర్‌పై కార్లను అనుమతించేది లేదని స్పష్టం చేసింది. ఓఆర్‌ఆర్‌పై ప్రయాణించే సరకు రవాణా వాహనాల్లో ప్రయాణికులున్నట్లుగా టోల్‌ ప్లాజా సిబ్బంది గుర్తిస్తే స్థానిక పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించాలని హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని