మహారాష్ట్రలో కరోనా ఉగ్రరూపం

తాజా వార్తలు

Published : 21/05/2020 21:49 IST

మహారాష్ట్రలో కరోనా ఉగ్రరూపం

ఒక్కరోజే 2345 కేసులు; 64 మరణాలు

ముంబయి: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం కొనసాగుతోంది. రాష్ట్రంలో ఈ రోజు రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదయ్యాయి. ఒక్క రోజులోనే 2,345 పాజిటివ్‌ కేసులు రాగా.. 64మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 41,642 నమోదు కాగా.. మరణాల సంఖ్య 1454కి చేరినట్టు వైద్యశాఖ అధికారులు వెల్లడించారు. 

ధారవిలో కొత్త మరణాల్లేవు!
ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ధారవిలో కొత్తగా 47 కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ మొత్తం కేసుల సంఖ్య 1425కి పెరిగాయి. మరోవైపు, గడిచిన 24 గంటల్లో ఈ ప్రాంతంలో కొత్త మరణాలేవీ సంభవించలేదని బృహాన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ వెల్లడించింది. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో 56మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసుల్లో మాతుంగా లేబర్‌ క్యాంపులో అత్యధికంగా ఆరు, ముకుంద్‌నగర్‌ ప్రాంతంలో ఐదు కేసులు చొప్పున నమోదైనట్టు అధికారులు తెలిపారు.  

మరోవైపు, ముంబయిలోని ధారవిలో కేంద్ర సాయుధ బలగాలు (సీఏపీఎఫ్‌)ను మోహరించాయి. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు రాష్ట్ర పోలీసులకు సహకరించేందుకు కేంద్రం సీఏపీఎఫ్‌ బలగాలను మహారాష్ట్రకు తరలించింది. నిన్న రాత్రి సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది బెండీ బజార్‌లో కవాతు నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. ముంబయిలో సోమవారం ఐదు కంపెనీల సీఏపీఎఫ్‌ బలగాలను మోహరించినట్టు అధికారులు తెలిపారు. 

బాంబే డయింగ్‌ రూ.27లక్షల విరాళం
కరోనా కాలంలో అహర్నిశలు శ్రమించి పనిచేస్తున్న ముంబయి పోలీసులకు వాడియా కుటుంబం చేయూతగా నిలిచింది. తమ బాంబే డయింగ్‌ సంస్థ తరఫున ముంబయి పోలీస్‌ ఫౌండేషన్‌కు రూ. రూ.27లక్షలు విరాళంగా ప్రకటించింది. దీంతో ముంబయి పోలీస్‌ కమిషనర్‌ ఆ కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మొత్తాన్ని పోలీసుల సంక్షేమం కోసం వినియోగిస్తామన్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని