చారిత్రక చిహ్నం తొలగింపుపై దుమారం

తాజా వార్తలు

Updated : 23/05/2020 14:08 IST

చారిత్రక చిహ్నం తొలగింపుపై దుమారం

విజయనగరం: విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని చారిత్రాత్మక చిహ్నం ‘మూడు లాంతర్ల’ను తొలగించడం తీవ్ర దుమారం రేపింది.
చారిత్రక చిహ్నం తొలగించడాన్ని కేంద్ర మాజీ మంత్రి పి.అశోక్‌గజపతిరాజు ఆక్షేపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ...
‘‘విజయనగరం వైభవానికి కొన్ని ఆనవాళ్లు ఉన్నాయి. గంట స్తంభం, మూడులాంతర్లు, సంగీత కళాశాల ఇందులో ప్రధానమైనవి. వందల ఏళ్ల క్రితం విజయనగరంలో నిర్మించిన మూడు లాంతర్ల కట్టడం విజయనగరానికి చారిత్రక చిహ్నం. ఈ జంక్షన్‌ వద్ద హరికథ పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు హరికథలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి చారిత్ర కట్టడాలు కూల్చివేయడం బాధాకరం. మూడు లాంతర్ల వద్ద స్వాతంత్ర్య సమరయోధులు నిర్మించిన మూడు సింహాల చిహ్నానికి ఇప్పటి ప్రభుత్వాలు, అధికారులు గౌరవం ఇవ్వకపోవటం విచారకరం. రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉన్న నాయకులే చారిత్రక చిహ్నాల ధ్వంసానికి పాల్పడటం దారుణం. ఈ ఘటనపై ప్రజలు స్పందించాలి. చరిత్రకు, చరిత్ర ఆనవాళ్లకు జరుగుతున్న నష్టాన్ని అడ్డుకోవాలి’’ అని అశోక్‌గజపతిరాజు పిలుపునిచ్చారు.

వివిధ పార్టీల ఆందోళన...
చారిత్రక చిహ్నం మూడులాంతర్లను తొలగించడంపై వివిధ పార్టీల నేతలు ఆందోళనకు దిగారు. సీపీఎం, సీపీఐ, బీఎస్పీ, జనసేన, లోక్‌సత్తా నేతలు మూడు లాంతర్ల కూడలి వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. విజయనగరం ఆనవాళ్లు తెలియజేసే కట్టడాలు లేకుండా చేయటం దారుణమన్నారు. అభివృద్ధి పేరిట విధ్వంసం తగదన్నారు. Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని