7 రోజుల్లోనే లక్ష మంది తరలింపు: ద.మ.రైల్వే

తాజా వార్తలు

Published : 24/05/2020 17:07 IST

7 రోజుల్లోనే లక్ష మంది తరలింపు: ద.మ.రైల్వే

హైదరాబాద్‌: శ్రామిక్‌ రైళ్లలో ఇప్పటివరకు దాదాపు 2 లక్షల మందికిపైగా ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేసినట్లు దక్షిణమధ్య రైల్వే (ద.మ.రైల్వే) వెల్లడించింది. మే 1 నుంచి 23 వరకు 2,41,768 మందిని స్వస్థలాలకు పంపినట్లు పేర్కొంది. ఈ మేరకు ద.మ.రైల్వే ప్రకటన విడుదల చేసింది. ద.మ.రైల్లే జోన్ పరిధిలో 16 రోజుల్లో మొదటి లక్ష మందిని చేరవేర్చినట్లు వెల్లడించింది. తర్వాత లక్ష మంది ప్రయాణికులను కేవలం 7 రోజుల్లోనే తరలించినట్లు తెలిపింది. జోన్ పరిధిలో తెలంగాణ నుంచి 1.50 లక్షలు, ఏపీ నుంచి 65 వేలకు పైగా ప్రయాణికులు శ్రామిక్‌ రైళ్ల ద్వారా వారి స్వస్థలాలకు చేరుకున్నట్లు వెల్లడించింది. ఇవాళ్టి వరకు జోన్‌ పరిధిలో 196 శ్రామిక్‌ రైళ్లను నడపగా.. శనివారం ఒక్కరోజు కేవలం 12 గంటల వ్యవధిలో 43 రైళ్లను నడిపినట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని