తెలుగు రాష్ట్రాల సీఎంల రంజాన్‌ శుభాకాంక్షలు

తాజా వార్తలు

Updated : 24/05/2020 22:44 IST

తెలుగు రాష్ట్రాల సీఎంల రంజాన్‌ శుభాకాంక్షలు

 

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లోని ముస్లిం సోదరులకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రంజాన్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్‌ మత సామరస్యానికి నిదర్శనమని కేసీఆర్‌ అన్నారు. రంజాన్‌ సందర్భంగా వారి జీవితాల్లో సుఖసంతోషాలు నిండాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండి పండుగ జరుపుకోవాలని కేసీఆర్‌ ముస్లింలను కోరారు. ఏపీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి ముస్లిం సోదరులకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్‌ పండుగ సామరస్యం, సహృద్భావం, దాతృత్వానికి ప్రతీక అని జగన్‌ మోహన్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ జాగ్రత్తలు పాటిస్తూ కఠిన ఉపవాస దీక్షలు ఆచరించారన్నారు. ఐకమత్యంతో మెలగడం, క్రమశిక్షణ కలిగి ఉండడం, పేదలకు తోడ్పాటునందించడం లాంటివి ఈ పండుగ మానవాళికి ఇచ్చే గొప్ప సందేశమని సీఎం జగన్‌ అన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని