భూమి కంపించినా బెదరని ప్రధాని!
close

తాజా వార్తలు

Published : 25/05/2020 11:05 IST

భూమి కంపించినా బెదరని ప్రధాని!

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌లో సోమవారం ఉదయం భూమి కంపించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 5.6గా నమోదైంది. ఆ సమయంలో ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తున్న  ప్రధాని జెసిండా అర్డెర్న్‌ మాత్రం తనదైన శైలిలో కార్యక్రమాన్ని కొనసాగించారు. తానున్న భవనం కుదుపులకు లోనవుతున్నా.. పెద్దగా ఆందోళనకు గురికాలేదు. అయితే.. ఆమె ధీమాకు కారణం లేకపోలేదు లెండి! పార్లమెంటు కాంప్లెక్సులో ఉండే ఆ భవనం భూకంపాలను సైతం తట్టుకునేలా నిర్మించారు. ఏదేమైనా భూమి కంపిస్తున్న సమయంలో అంత తేలిగ్గా తీసుకోవడం ఆమెకే చెల్లింది. భూమి కంపించిన సమయంలో వ్యాఖ్యాతకు, ఆమెకు మధ్య సంభాషణ ఇలా సాగింది...

‘‘ర్యాన్‌(వ్యాఖ్యాత).. ఇక్కడ భూమి కంపిస్తోంది. చుట్టూ వస్తువులు కదులుతున్నాయి చూశావా..?’’ గదిలో ఇటుఅటూ చూస్తూ అన్నారు జెసిండా. అనంతరం కొద్దిసేపట్లో ‘‘ఇక ఆగిపోయింది. సురక్షితంగా ఉన్నాం. నాపై ఎలాంటి వేలాడుతున్న విద్యుత్తు దీపాలు లేవు. నేను ఉన్న నిర్మాణం చాలా బలమైందనుకుంటా’’ అని చాలా సాధారణంగా వ్యాఖ్యానించారు. ఆ సమయంలో ఆమెలో ఎలాంటి భయంగానీ, ఆందోళనగానీ కనిపించలేదు.

సోమవారం ఉదయం సంభవించిన ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. కొన్నిచోట్ల రైళ్లు నిలిచిపోయినట్లు పేర్కొన్నారు. ‘పసిఫిక్‌ రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌’ ప్రాంతంలో ఉన్న న్యూజిలాండ్‌లో భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు తరచూ సంభవిస్తుంటాయి. 2011లో క్రైస్ట్‌చర్చ్‌ నగరంలో భూకంపం 185 మందిని పొట్టనబెట్టుకుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని