పశువులు అమ్మి..విమానం టికెట్లు కొని

తాజా వార్తలు

Published : 28/05/2020 02:34 IST

పశువులు అమ్మి..విమానం టికెట్లు కొని


ముంబయి: లాక్‌డౌన్‌ కారణంగా జీవనోపాధి కోల్పోయిన వలస కూలీలు నగరాల్లో ఉండలేక సొంతూళ్లకు వెళ్లే క్రమంలో అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితులే ఎదుర్కొంటున్న ఓ కార్మికుడు ఇంటివద్ద జీవనాధారంగా ఉన్న పశువుల్ని అమ్మి విమానం టికెట్లు కొనుగోలు చేశాడు. చివరికి ఆ ప్రయత్నంలో కూడా ఆటంకాలు ఎదురయ్యాయి. వివరాల్లోకి వెళ్తే..

మహారాష్ట్రలోని ముంబయిలో చిక్కుకుపోయిన ముగ్గురు వలస కార్మికులు పశ్చిమబెంగాల్‌లోని సొంత ప్రాంతం ముర్షిదాబాద్‌కు వెళ్లాలనుకున్నారు. రైల్లో వెళ్లడానికి ప్రయత్నించగా టికెట్లు దొరకలేదు. దాంతో వారిలో ఓ వ్యక్తి ఇంటివద్ద పశువులను అమ్మడం ద్వారా విమానం టికెట్‌కు సరిపడా డబ్బులను సంపాదించుకోగలిగాడు. మిగతా వారు కూడా ఇతర మార్గాల ద్వారా అవసరమైన సొమ్మును సమకూర్చుకున్నారు. చివరకు ముంబయి నుంచి కోల్‌కతాకు మే 25న ఇండిగో విమానంలో ప్రయాణించేలా ముగ్గురు టికెట్లు కొనుగోలు చేశారు. కానీ విమానం రద్దు కావడంతో ఇంటికి వెళ్లాలన్న వారి ఆశకు గండిపడింది. అంతేకాకుండా వారి టికెట్ సొమ్ము కూడా వెనక్కి రాలేదు. దాంతో వారు విమానాశ్రయానికి చేరుకొని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఫొటోలు వెలుగులోకి రావడంతో నెట్టింట్లో సదరు సంస్థ మీద విమర్శలు వెల్లువెత్తాయి. 

దానిపై ఇండిగో సంస్థ ట్విటర్ వేదికగా వివరణ ఇచ్చింది. ఈ అంశం తమ దృష్టికి వచ్చిందని, వారి సమస్యను పరిష్కరించామని వెల్లడించింది. వారి ప్రయాణానికి జూన్‌ 1కి టికెట్లు బుక్‌ చేశామని తెలిపింది.

ఇవీ చదవండి: 

వలస కార్మికులకు ఉచితంగా సదుపాయాలు కల్పించాలి

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని