ఆర్టీసీ బస్సులో మహిళ ప్రసవం

తాజా వార్తలు

Published : 27/05/2020 16:29 IST

ఆర్టీసీ బస్సులో మహిళ ప్రసవం

తల్లీ బిడ్డ క్షేమం

గట్టు: ఆర్టీసీ బస్సులోనే మహిళ ప్రసవించిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది. గట్టు మండలంలోని ఆరేగిద్ద గ్రామానికి చెందిన గోపాలమ్మ బుధవారం ఆర్టీసీ బస్సులో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గోపాలమ్మ చికిత్స కోసం బుధవారం ఆరేగిద్ద నుంచి గట్టులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఆర్టీసీ బస్సులో బయలుదేరింది. ఈ క్రమంలో మార్గమధ్యంలోనే పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో తోటి మహిళా ప్రయాణికులే ఆమెకు పురుడు పోశారు. దీంతో మహిళ పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది. అనంతనం అదే బస్సులో గట్టు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ మహిళకు చికిత్స అందించిన అనంతరం తల్లీ బిడ్డ క్షేమంగానే ఉన్నారని వైద్యుడు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని