జాతీయ హోదా ఇస్తామని చెప్పలేదు: కిషన్‌రెడ్డి

తాజా వార్తలు

Updated : 30/05/2020 15:24 IST

జాతీయ హోదా ఇస్తామని చెప్పలేదు: కిషన్‌రెడ్డి

దిల్లీ: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ఎక్కడా ప్రకటించలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు. దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మీడియాతో ఆయన మాట్లాడారు. విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టుకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా కల్పించిందని గుర్తు చేశారు. దేశంలో అనేక పేద రాష్ట్రాలున్నాయని.. అలాంటి చోట కూడా జాతీయ హోదా కల్పించిన ప్రాజెక్టులు లేవన్నారు. ఇతర రాష్ట్రాల ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చినట్లు అయితే తెలంగాణ ప్రాజెక్టులకు కూడా జాతీయహోదా కోసం కృషి చేస్తానన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన ఏడాది పాలనలోనే అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని కిషన్‌ రెడ్డి కొనియాడారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊతమిచ్చే విధంగా అనేక పథకాలు తీసుకొచ్చారన్నారు. మేకిన్‌ ఇండియాలో భాగంగా భారతీయ ఉత్పత్తి, తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు ఎన్నో ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు చెప్పారు. 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా నిర్ధేశించుకున్న సమయంలో కరోనా మహమ్మారి వ్యాప్తి చెందిందని.. దీని వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే పరిస్థితి నెలకొందని కిషన్‌ రెడ్డి వివరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని