లిఫ్టులో చిన్నారి: ఒళ్లు గగుర్పొడిచే వీడియో
close

తాజా వార్తలు

Updated : 30/05/2020 19:32 IST

లిఫ్టులో చిన్నారి: ఒళ్లు గగుర్పొడిచే వీడియో

ఇంటర్నెట్‌ డెస్క్‌: లిఫ్టులో పైకి కిందికి వెళుతూ ఆడుకోవటం అంటే పిల్లలకు చాలా ఇష్టం. తల్లితండ్రులు కూడా ఇందులో ఏమీ ప్రమాదం లేదనే అనుకుంటారు. అయితే ఎవరూ వెంటలేకుండా చిన్నారులను లిఫ్టులో ఒంటరిగా వెళ్లనిచ్చే విషయంలో వీరు మరోసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపే వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. గుండె కొట్టుకోవటం ఒక్క క్షణం ఆగిపోయేలా ఉన్న ఈ వీడియోలో... పెద్దలు ఎవరూ వెంటలేకుండా ఓ చిన్నారి లిఫ్టులోకి రావటం చూడవచ్చు. ఆ పాప చేతికి ఓ తాడు లాంటి బ్యాండ్‌ ఉంది. అయితే ఆ బ్యాండ్‌ లిఫ్ట్‌ తలుపులో ఇరుక్కుపోవటం గమనించని ఆ చిన్నారి... తను వెళ్లాల్సిన ఫ్లోర్‌ నంబర్‌ను నొక్కేసింది. దీనితో కొద్ది సెకెన్ల పాటు భయానక సంఘటన చోటుచేసుకుంది. లిఫ్టు కదలడం మొదలుకావటంతో... చేతికున్న బ్యాండ్‌తో పాటు గాలిలోకి లేచిన చిన్నారి, అలాగే సుమారు నిముషం పాటు వేలాడటం గమనించవచ్చు. అదృష్టవశాత్తూ లిఫ్టు అత్యవసరంగా ఆగటంతో చిన్నారి ప్రమాదం నుంచి బయటపడింది. లేదంటే ఊహించటానికే భయం కలిగించే విషాదం సంభవించి ఉండేది. 

 

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని