ఎస్‌ఈసీ బాధ్యతల స్వీకరణ ఉత్తర్వులు వెనక్కి

తాజా వార్తలు

Published : 30/05/2020 22:44 IST

ఎస్‌ఈసీ బాధ్యతల స్వీకరణ ఉత్తర్వులు వెనక్కి

వెల్లడించిన ఎస్‌ఈసీ కార్యదర్శి

అమరావతి: నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ వ్యవహారం మరో మలుపు తీసుకుంది. ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఆయన బాధ్యతల స్వీకరణకు సంబంధించి ఇచ్చిన ఉత్వర్వులను వెనక్కి తీసుకుంటున్నట్లు ఎస్‌ఈసీ కార్యదర్శి ప్రకటించారు. ఆయన పునర్‌ నియామకానికి సంబంధించి అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ అభ్యంతరాలు లేవనెత్తిన కాసేపటికే ఈ ప్రకటన వెలువడడం గమనార్హం.

అంతకుముందు ఏజీ మీడియాతో మాట్లాడుతూ.. ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను ఎప్పటిలోగా నియమించాలనే విషయంలో హైకోర్టు నిర్దిష్ట గడువేమీ విధించలేదని ఆయన అన్నారు. తీర్పు అమలుకు కోర్టు కాలపరిమితి విధించకపోతే రెండు నెలలు గడువు ఉంటుందని చెప్పారు. అయితే ఈలోపే నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ తనకు తానుగా బాధ్యతలు స్వీకరించినట్లు ప్రకటన విడుదల చేశారని, బాధ్యతలు చేపట్టినట్లు వివిధ శాఖల ఉన్నతాధికారులకు సర్క్యులర్‌ పంపారని చెప్పారు. ఆయనను ఎస్‌ఈసీగా కొనసాగించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిందే తప్ప.. బాధ్యతలు తీసుకోవాలని రమేశ్‌కుమార్‌కు చెప్పలేదని ఏజీ తెలిపారు. హైకోర్టు తీర్పు ప్రకారం రమేశ్‌ కుమార్‌ను తిరిగి నియమించాలంటే చట్టపరమైన చిక్కులున్నాయని, కొన్ని అంశాల్లో సందిగ్ధత ఉన్నందునే సుప్రీంకోర్టుకు వెళ్లాలని భావించినట్లు ఏజీ శ్రీరాం స్పష్టం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని