తాజ్‌మహల్‌ సమీపంలో పిడుగు

తాజా వార్తలు

Published : 31/05/2020 20:34 IST

తాజ్‌మహల్‌ సమీపంలో పిడుగు

ఆగ్రా: పిడుగుల ధాటికి చారిత్రక కట్టడం తాజ్‌మహల్‌ ప్రాంగణంలోని కొన్ని భాగాలు దెబ్బతిన్నాయి. వివరాల్లోకి వెళితే శుక్రవారం రాత్రి ఆగ్రాలోని తాజ్‌మహల్‌ ప్రాంతం పిడుగుల శబ్దంతో దద్దరిల్లింది. దీంతో ప్రఖ్యాత భారత వారసత్వ సంపదైన తాజ్‌మహల్‌కు సంబంధించిన ప్రధాన ద్వారంతో పాటు ప్రధాన గుమ్మటానికి అనుకుని ఉన్న మిగతా గుమ్మటాల పిట్టగోడలు దెబ్బతిన్నాయి. దీనిపై భారత పురావస్తుశాఖ అధికారి వసంత్‌కుమార్‌ సావర్కర్‌ మాట్లాడుతూ.. ‘‘పిడుగుల ధాటికి రాతితో నిర్మించిన పిట్టగోడ భాగం దెబ్బతింది. అలాగే పాలరాతితో నిర్మించిన మరో పిట్టగోడ‌, పర్యాటకులు నిల్చునే ప్రాంతంలోని పై భాగం, ప్రధాన ద్వారం వద్ద ఉన్న గోడలు దెబ్బతిన్నాయి.  ప్రధాన గుమ్మటానికి మాత్రం ఎటువంటి ప్రమాదం లేదు’’ అని ఆయన పేర్కొన్నారు. వెంటనే వాటి పునరుద్ధరణ చర్యలు చేపట్టినట్టు తెలిపారు. కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌తో గత రెండు నెలలుగా తాజ్‌మహల్‌ ప్రాంతానికి పర్యాటకులు అనుమతిని నిలిపివేసిన సంగతి తెలిసిందే. మరోవైపు పిడుగుల ధాటికి ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో సుమారు 13 మంది మృత్యువాత పడ్డారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని