పంటల ప్రణాళికపై సీఎం జగన్‌ సమీక్ష

తాజా వార్తలు

Published : 01/06/2020 15:30 IST

పంటల ప్రణాళికపై సీఎం జగన్‌ సమీక్ష

అమరావతి: రైతు భరోసా కేంద్రాల పరిధిలో ఏ పంటలు వేయాలన్న దానిపై మ్యాపింగ్‌ చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ అధికారులను ఆదేశించారు. పంటల ప్రణాళిక, ఈ- మార్కెటింగ్‌ ఫ్లాట్‌ఫాంలపై అధికారులతో సీఎం సమీక్షించారు. జిల్లా, మండల స్థాయిలో వ్యవసాయ సలహా బోర్డుల ఏర్పాటు చేయాలని, మార్కెటింగ్‌ చేయలేని పంటలు వేస్తే రైతులు నష్టపోతారని జగన్‌ అన్నారు. ఈ- క్రాపింగ్‌పై మార్గదర్శకాలను, ఎస్‌వోపీలను తయారు చేయాలని సూచించారు. 

ఈ-క్రాపింగ్‌ విధివిధానాలను గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల్లో ఉంచాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. 30 శాతం పంటలను కొనుగోలు చేయాలని నిర్ణయించామని, మిగతా 70 శాతం పంటలను కూడా అమ్ముడయ్యేలా చూడాలన్నారు. దీని కోసం ఈ మార్కెటింగ్‌ ఫ్లాట్‌ఫాంను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రామస్థాయిలో గ్రేడింగ్‌, ప్యాకింగ్‌ సదుపాయాలు ఉండాలని సూచించారు. గ్రేడింగ్‌, ప్యాకింగ్‌, ప్రాసెసింగ్‌ చేయకపోతే నాణ్యత పాటించలేమన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని