రాత్రి 8గంటల వరకు మద్యం దుకాణాలు

తాజా వార్తలు

Published : 01/06/2020 20:14 IST

రాత్రి 8గంటల వరకు మద్యం దుకాణాలు

హైదరాబాద్‌: తెలంగాణలో నేటి నుంచి మద్యం దుకాణాలు రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటాయని అబ్కారీ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్లకు, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్లకు, డిప్యూటీ కమిషనర్లకు, జాయింట్‌ కమిషనర్లకు, అదనపు కమిషనర్లకు ఆ శాఖ కమిషనర్ స్వయంగా సమాచారం ఇచ్చి ఇవాళ్టి నుంచి అమలయ్యేట్లు చూడాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం లాక్‌ డౌన్‌ నిబంధనల్లో మరిన్ని సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో అబ్కారీ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. 
మే 31వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే మద్యం దుకాణాలు తెరిచి ఉంచేట్లు నిబంధనలు అమలయ్యేవి. ఇప్పుడు రాత్రి 8 గంటల వరకు దుకాణాలు తెరిచే ఉంటాయి. తాజాగా మరో రెండు గంటల పాటు సమయాన్ని పొడిగించడం వల్ల.. మద్యం అమ్మకాలు మరింత పెరిగేందుకు అవకాశం ఏర్పడుతుందని దుకాణదారులు అంచనా వేస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని