ఆ అధికారం మాకుంది: ఎన్జీటీ

తాజా వార్తలు

Published : 03/06/2020 19:06 IST

ఆ అధికారం మాకుంది: ఎన్జీటీ

ఎల్‌జీ పాలిమర్స్‌ కేసుపై లిఖితపూర్వక ఆదేశాలు జారీ

దిల్లీ: ఎల్‌జీ పాలిమర్స్‌ సంస్థ డిపాజిట్‌ చేసిన రూ.50 కోట్లను పర్యావరణ పునరుద్ధరణ, పరిహారానికి వాడాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఆదేశించింది. ఎల్‌జీ పాలిమర్స్‌ కేసుకు సంబంధించి ఎన్జీటీ లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పర్యావరణ పునరుద్ధరణ కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. కేంద్ర పర్యావరణ శాఖ, పీసీబీ నుంచి ఒక్కొక్కరు, విశాఖ కలెక్టర్‌తో కమిటీ ఏర్పాటు చేయాలని.. రెండు నెలల్లోగా కమిటీ పునరుద్ధరణ ప్రణాళిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. కమిటీకి కేంద్ర పర్యావరణ శాఖ నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరించాలని సూచించింది. బాధితులకు పరిహారం ఎంత ఇవ్వాలన్నది నిర్ణయించేందుకుగానూ మరో కమిటీని కూడా ఏర్పాటు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. రెండు వారాల్లో కమిటీని ఏర్పాటు చేసి రెండు నెలల్లోగా నివేదిక సమర్పించాలని కేంద్ర పర్యావరణ శాఖ కార్యదర్శిని ఆదేశించింది.

‘‘లాక్‌డౌన్ తర్వాత అనుమతి లేకుండా పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు బాధ్యులైన వారిని గుర్తించి ఏపీ సీఎస్‌ చర్యలు తీసుకోవాలి. తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికను రెండు నెలల్లోగా ఇవ్వాలి. చట్టబద్ధ అనుమతి లేకుండా ఎల్‌జీ పాలిమర్స్‌ మళ్లీ ప్రారంభం కాకూడదు. చట్టబద్ధ అనుమతి వచ్చాక ప్రారంభించేందుకు మేమే అనుమతి ఇస్తాం. ఇలాంటి ప్లాంట్లలో పర్యావరణ నిబంధనల తనిఖీకి నిపుణుల కమిటీ వేయాలి. ఆ కమిటీ తనిఖీలు చేసి 3 నెలల్లో నివేదిక ఇవ్వాలి. సుమోటోగా కేసు స్వీకరించే అధికారం ఎన్జీటీకి ఉంది. పర్యావరణానికి హాని కలిగినప్పుడు మౌనంగా కూర్చోలేం’ అని ఎన్జీటీ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని