ఏపీలో మరో 16 మెడికల్‌ కళాశాలలు: ఆళ్లనాని

తాజా వార్తలు

Published : 04/06/2020 16:11 IST

ఏపీలో మరో 16 మెడికల్‌ కళాశాలలు: ఆళ్లనాని

విజయనగరం: రాష్ట్రంలో వైద్యారోగ్యశాఖను బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని ఆ శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునికీకరణ చేస్తున్నామన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయనున్న ప్రభుత్వ వైద్య కళాశాల కోసం ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి, రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌తో కలిసి ఆయన స్థల పరిశీలన చేశారు. అనంతరం స్థలం ఎంపికపై అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించారు. ఆళ్లనాని మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 11 మెడికల్‌ కళాశాలలతోపాటు కొత్తగా మరో 16 మెడికల్‌ కళాశాలను ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించినట్లు తెలిపారు. దీని కోసం రూ.16 వేల కోట్లు కేటాయించినట్లు చెప్పారు. వీటి నిర్మాణానికి ఆగస్టు నెలలో టెండర్లు పిలవనున్నట్లు మంత్రి ఆళ్లనాని స్పష్టం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని