తగ్గిన రైలు ప్రయాణికులు

తాజా వార్తలు

Published : 05/06/2020 09:30 IST

తగ్గిన రైలు ప్రయాణికులు

సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి వెళ్తున్న ప్రధాన రైళ్లలో ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. రిజర్వేషన్‌ చేసుకుని వచ్చినవారినే అనుమతిస్తుండటం, వారు కూడా చాలామంది ప్రయాణించకపోవడమే దీనికి కారణం. రైల్వే చార్ట్‌ ప్రకారం సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి గురువారం గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు 1516 మంది రిజర్వేషన్‌ చేసుకుని ఉండగా 1276 మంది మాత్రమే ఎక్కినట్లు అధికారులు గుర్తించారు. ఇదే క్రమంలో ఫలక్‌నుమాలో వెళ్లాల్సిన ప్రయాణికుల సంఖ్య 1493 ఉండగా 1400 మంది ప్రయాణించారు. నిజామాబాద్‌ నుంచి సికింద్రాబాద్‌ మీదుగా తిరుపతి వెళ్తున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో 620 మంది సికింద్రాబాద్‌ స్టేషన్‌లో ఎక్కాల్సి ఉండగా 421మంది మాత్రమే వచ్చినట్లు గుర్తించారు.

-  రెజిమెంటల్‌బజార్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని