కన్నవారే..కాటికి పంపారు

తాజా వార్తలు

Updated : 09/06/2020 07:25 IST

కన్నవారే..కాటికి పంపారు

  ప్రేమించిన వాడితో పెళ్లి చేయాలన్న కుమార్తె
  కోపంతో బిడ్డను చంపిన తల్లిదండ్రులు
  గద్వాల జిల్లాలో ఆలస్యంగా  వెలుగుచూసిన పరువు హత్య

శాంతినగర్‌ : కనిపెంచిన వారే కాఠిన్యం ప్రదర్శించారు. తాను మనసు పడిన వాడితోనే మనువు జరపమని పట్టుబట్టిన కుమార్తెపై కసి పెంచుకున్నారు. చివరికి ఊపిరి పోసిన చేత్తోనే..ఊపిరి తీశారు. జోగులాంబ గద్వాల జిల్లా కలుకుంట్ల గ్రామంలో శనివారం జరిగిన పరువు హత్య సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. శాంతినగర్‌ సీఐ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. కలుకుంట్లకు చెందిన భాస్కరయ్యకు ముగ్గురు కుమార్తెలు.

మూడో అమ్మాయి దివ్య(18) ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కర్నూలు పట్టణంలోని సెయింట్‌ జోసఫ్‌ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. అక్కడే పరిచయమైన కోడుమూరుకు చెందిన ఒక యువకుడితో ప్రేమలో పడింది. ఇటీవల దివ్య అనారోగ్యానికి గురవగా, తల్లిదండ్రులు శనివారం కర్నూలు ఆసుపత్రికి తీసుకెళ్లారు. కుమార్తె 13 వారాల గర్భవతి అని తెలియడంతో మందలించారు. బలవంతంగా గర్భస్రావం చేయించేందుకు ప్రయత్నించారు. ‘‘దానికి కుమార్తె అంగీకరించలేదు. పైగా అతనితోనే పెళ్లిచేయాలని పట్టుబట్టడంతో నచ్చజెప్పి ఇంటికి తీసుకువచ్చారు. అదే రోజు ఆమెను చంపాలనే నిర్ణయానికి వచ్చారు. పథకం ప్రకారం శనివారం ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆరుబయట పడుకున్నారు. అర్ధరాత్రి దాటాక ఇంట్లో నిద్రిస్తున్న దివ్య ముఖంపై దిండుతో అదిమి ప్రాణం తీశారు. తమ కుమార్తెది సహజ మరణమేనంటూ ఆదివారం అందర్నీ నమ్మించే ప్రయత్నం చేశారు. గ్రామ కార్యదర్శి ఫిర్యాదు మేరకు తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశాం. విచారణలో అసలు నిజం బయటపడింది’ అని సీఐ తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని