విశాఖ ఘటనపై నివేదిక సమర్పణ గడుపుపెంపు

తాజా వార్తలు

Published : 09/06/2020 18:58 IST

విశాఖ ఘటనపై నివేదిక సమర్పణ గడుపుపెంపు

అమరావతి: విశాఖలోని ఆర్ఆర్‌.వెంకటాపురంలో జరిగిన గ్యాస్‌ లీకేజీ ఘటనపై ఏర్పాటైన హైపవర్‌ కమిటీ నివేదిక ఇచ్చేందుకు గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. నివేదిక సమర్పించేందుకు మరికొంత సమయం కావాలని నీరబ్‌ కుమార్ ప్రసాద్‌ నేతృత్వంలోని కమిటీ ప్రభుత్వాన్ని కోరడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు విశాఖ ఘటనకు సంబంధించి ఈ నెల 7వ తేదీలోగా కమిటీ నివేదిక ఇవ్వాల్సి ఉంది. అంతేకాకుండా ప్రమాద ఘటనపై మరిన్ని కోణాల్లో విచారణ చేపట్టాలని ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో వివిధ కేంద్ర సంస్థల నిపుణులకు హైపవర్‌ కమిటీలో చోటు కల్పిస్తూ ఆదేశాలిచ్చింది. సీపెట్‌, సీపీసీబీ, డీజీఎఫ్‌ఏఎస్‌ఎల్‌ఐ, ఐఐపీ నిపుణులను కమిటీలో కమిటీలో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జూన్‌ 22 నాటికి హైపవర్‌ కమిటీ నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని