వైద్యం అందించకుంటే కఠిన చర్యలు

తాజా వార్తలు

Updated : 10/06/2020 20:12 IST

వైద్యం అందించకుంటే కఠిన చర్యలు

దిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాల (సీజీహెచ్‌ఎస్‌) అమలుకు నమోదు చేసుకున్న అన్ని ప్రైవేటు ఆస్పత్రులు తప్పనిసరిగా లబ్దిదారులకు చికిత్స అందించాలని కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన ఆస్పత్రులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. అలానే కరోనా చికిత్సకు అనువైన ఆస్పత్రులుగా గుర్తించిన ప్రైవేటు ఆస్పత్రుల్లో వైరస్‌ బారిన పడిన వారితో పాటు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికి చికిత్స చేసేందుకు నిరాకరించినా చర్యలు తప్పవని పేర్కొంది. ఈ మేరకు సీజీహెచ్‌ఎస్‌ అమలుకు నమోదు చేసుకున్న ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నస్టిక్‌ సెంటర్లలో సేవలు పొందేందుకు అర్హులైనవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు మంత్రిత్వశాఖ దృష్టికి రావడంతో సమీక్ష నిర్వహించింది. 

‘‘పరిస్థితిపై సమీక్షించాం. సీజీహెచ్‌ఎస్‌ అమలుకు నమోదు చేసుకున్న అన్ని ఆస్పత్రులు అర్హులకు తప్పక సేవలందించాలి. అలానే కరోనా చికిత్స కోసం రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించిన ఆస్పత్రులు నిబంధనల ప్రకారం సీజీహెచ్‌ఎస్‌ అర్హులందరికీ అవసరమైన వైద్య సేవలను అందించాలి. కరోనా సంబంధించిన అన్ని చికిత్సలు కూడా. అలానే సీజీహెచ్‌ఎస్‌ అమలుకు నమోదయి, కరోనా ఆస్పత్రులుగా గుర్తించని వాటిలో వైద్యానికి కానీ, రోగులను చేర్చుకునేందుకు నిరాకరించకూడదు. అన్ని రకాల రోగాలకు నిబంధనల మేరకే  ఫీజులు వసూలు చేయాలి. ఈ మేరకు ప్రభుత్వ మార్గదర్శకాలు అతిక్రమించిన ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటాం’’ అని ఒక ప్రకటనలో తెలిపింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని