కరోనా అంటే మాకేం భయం!

తాజా వార్తలు

Published : 12/06/2020 23:40 IST

కరోనా అంటే మాకేం భయం!

హవేరి: కరోనా వైరస్‌ విజృంభిస్తున్నా ఉత్సవంలో వందల మంది పాల్గొన్నారు. మహమ్మారి మాకేం సోకదనే రీతిలో కనీసం మాస్క్‌లూ ధరించలేదు. భౌతిక దూరం కూడా పాటించలేదు. ఈ సంఘటన కర్ణాటకలోని హవేరీ జిల్లాలోని కర్జాగి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక శ్రీ బ్రహ్మలింగేశ్వర ఆలయంలో ఏడాదికోసారి జరిగే ఉత్సవానికి భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. వేసవి ముగిసి రుతుపవనాలు వచ్చాయని, విత్తనాలు వేసే సమయమని సూచిస్తూ ఉత్తర కర్ణాటకలోని అనేక ప్రాంతాల్లో ‘కారా హన్నిమె‌’ ఉత్సవాన్ని జరుపుకుంటారు. దీన్ని ఈ ఏడాది జూన్‌ 9 నుంచి 11 వరకు నిర్వహించారు.

అయితే ఉత్సవంలో భాగంగా జరిగిన ఎద్దుల బండి ఊరేగింపుని చూడటానికి ప్రజలు భారీ సంఖ్యలో వచ్చారు. రోడ్డుపై, గోడలపై, తమ ఇళ్లపై ఊరేగింపుని చూడటానికి కనీస భౌతిక దూరం కూడా పాటించలేదు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. వీడియోలో వందల మంది జనాలు కనిపించగా అందులో కేవలం ఒకే ఒక్క వ్యక్తి మాస్క్‌ ధరించడం గమనార్హం. అయితే నిబంధనలు అతిక్రమించి ఉత్సవాన్ని నిర్వహించినందుకు ఆలయ కమిటీలోని 30 మంది సభ్యులపై కేసు నమోదు చేశామని హవేరి డిప్యూటి కమిషనర్‌ కృష్ణ బాజ్‌పాయ్‌ తెలిపారు.

 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని