ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆంక్షలు

తాజా వార్తలు

Published : 13/06/2020 21:55 IST

ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆంక్షలు

అమరావతి: ఈనెల 16వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బడ్జెట్‌ సమావేశాలకు మీడియా పాయింట్‌ వద్ద అన్ని కార్యకలాపాలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా దృష్ట్యా అసెంబ్లీలోని మీడియా పాయింట్‌ వద్దకు ఎవరికీ అనుమతి లేదని తెలిపింది. ఉభయ సభల్లోనూ ప్రెస్ గ్యాలరీల వరకు మాత్రమే మీడియా ప్రతినిధులకు అనుమతి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అసెంబ్లీ లాబీల్లో మీడియా ప్రతినిధులు ప్రవేశించేందుకు అనుమతి లేదని ఉత్తర్వుల్లో పేర్కొంది.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని