ఆలోచనలు పంచుకోండి!

తాజా వార్తలు

Published : 14/06/2020 23:55 IST

ఆలోచనలు పంచుకోండి!

‘మన్‌కీ బాత్‌’ కోసం ప్రధాని పిలుపు

దిల్లీ: కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలు తమ ఆలోచనలు, సమస్యలను పంచుకోవాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈనెల 28న ప్రసారం కానున్న ఈ కార్యక్రమంలో చర్చించేందుకు ప్రజల నుంచి విలువైన సూచనలను ఆహ్వానిస్తున్నానని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో కొవిడ్‌-19తో పాటు ఇతర ముఖ్యమైన అంశాలపై తాను దృష్టి సారించే అవకాశం లభిస్తుందని మోదీ తెలిపారు. ఓపెన్‌ ఫోరం అయిన..‘ల్వీబ్ని్ర’ షేర్‌ చేసి లేదా టోల్‌ఫ్రీ నెంబర్‌ 1800-11-7800కు ఫోన్‌ చేసి తమ అభిప్రాయాలను పంచుకోవచ్చన్నారు. హిందీ, ఇంగ్లీషు భాషల్లో సందేశాలను పంపించాలన్నారు. అవన్నీ రికార్డవుతాయని, వాటిలో కొన్నింటిని ప్రసారం చేస్తామని చెప్పారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని