ట్రాక్టర్‌ స్టీరింగ్‌పట్టి పొలం దున్నిన యువతి

తాజా వార్తలు

Updated : 15/06/2020 11:58 IST

ట్రాక్టర్‌ స్టీరింగ్‌పట్టి పొలం దున్నిన యువతి

పంజాబ్‌: సాధారణంగా అమ్మాయిలు ట్రాక్టర్‌ స్టీరింగ్‌ పట్టి పొలంలో దున్నుతుండటం సినిమాల్లోనే చూస్తుంటాం. అలాంటిది నిజ జీవితంలో ఓ యువతి ఇలానే చేసి అందరి మన్ననలూ పొందుతోంది. మగవాళ్లకు తామేమీ తీసిపోమంటూ ఎంతో ఉత్సాహంగా పొలం పనుల్లో తండ్రికి సాయం చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

పంజాబ్‌లోని సంగ్రూర్‌కు చెందిన 20ఏళ్ల అమన్‌దీప్‌ కౌర్‌ ట్రాక్టర్‌ స్టీరింగ్‌ పట్టి పొలంలో వ్యవసాయం చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అబ్బాయిలకు ఏమాత్రం తీసిపోకుండా పొలం పనులన్నీ చక్కగా నేర్చుకుని తండ్రికి వ్యవసాయంలో సాయంగా నిలుస్తోంది. గత మూడేళ్లుగా తన తండ్రికి పొలం పనుల్లో సహాయం అందిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటోంది. వ్యవసాయ క్షేత్రంలో తన కూతురు పనిచేస్తుంటే చాలా సంతోషంగా ఉందని ఆమె తండ్రి చెబుతున్నాడు. స్థానికులు తన కూతుర్ని మెచ్చుకుంటుంటే చాలా గర్వంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. తాను లేకున్నా ఒక్కతే పొలం పనులు చూసుకుంటుందని అమన్‌ దీప్‌ తండ్రి వివరించాడు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని