122 హామీల్లో 77 నెరవేర్చాం

తాజా వార్తలు

Updated : 16/06/2020 11:07 IST

122 హామీల్లో 77 నెరవేర్చాం

ఏపీ అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగం

అమరావతి: ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. కరోనా నేపథ్యంలో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ రాజ్‌భవన్‌ నుంచి ఆన్‌లైన్‌ ద్వారా ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. గవర్నర్‌ ప్రసంగాన్ని వీక్షించేందుకు అసెంబ్లీలో, మండలిలో ప్రత్యేకంగా తెరలను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిలో సంక్షేమరంగానికి పెద్దపీట వేసినట్లు చెప్పారు. ప్రభుత్వం సాధించిన విజయాలు, లక్ష్యాలను గవర్నర్‌ తన ప్రసంగం ద్వారా వివరించారు.

గవర్నర్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

* మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చింది. 122 హామీల్లో 77 హామీలు నెరవేర్చాం, మిగిలినవి పరిశీలనలో ఉన్నాయి. మేనిఫెస్టోలో లేని 40 హామీలను కూడా నెరవేర్చాం.

ఏడాదిలో 3.98 కోట్ల మంది ప్రజలకు రూ.42వేల కోట్ల సాయం అందించాం.

* మధ్యవర్తుల ప్రమేయం లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. 

* 45 ఏళ్లు నిండిన మహిళలకు చేయూత. చేయూత కింద నాలుగేళ్లలో ఒక్కొక్కరికి రూ.75వేలు.

* అమ్మ ఒడి ద్వారా 42.33లక్షల మంది తల్లులకు రూ.6,350 కోట్లు.

* జగనన్న విద్యా కానుక ద్వారా విద్యార్థులకు కిట్స్‌.

* రాజకీయ, ఆర్థిక రంగాల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు.

* గత ఏడాది కంటే తలసరి ఆదాయం 12 శాతం వృద్ధి.

* మనబడి పథకంలో 15,700 స్కూళ్లలో మౌలిక వసతుల కల్పన. దశల వారీగా మూడేళ్లలో 45వేల పాఠశాలల అభివృద్ధి.

* జల, ఖనిజ వనరులను సద్వినియోగం చేసుకుంటున్నాం.

* విద్యుత్‌, రవాణా, పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తున్నాం. అణగారిన వర్గాలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ హక్కులు కల్పించేందుకు చర్యలు.

* సేవారంగంలో 9.1శాతం, వ్యవసాయ అనుబంధ రంగంలో 8శాతం వృద్ధి సాధించాం. పారిశ్రామిక రంగంలో 5శాతం వృద్ధి.

* 2019-20 ఆర్థిక సంవత్సరంలో 8.16 శాతం వృద్ధిరేటు సాధించాం.

* వైఎస్సార్‌ టెలీ మెడిసిన్‌ పథకం విజయవంతంగా కొనసాగుతోంది.

* పోర్టుల నిర్మాణానికి మూడేళ్లలో రూ.3,200 కోట్లు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని